హైదరాబాద్: మహిళలు, పిల్లల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్ఫష్టం చేశారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీ కారిడార్, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తామని చెప్పారు.
ఇప్పటి వరకూ సైబరాబాద్ పోలీస్ కమిషనగా వ్యవహరించిన వీసీ సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. సజ్జనార్ పలు కీలక కేసులను దర్యాప్తు చేయగా.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.