తాండూరు: ప్రస్తుత హోదాకు సమానంగా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని పలువురు వీఆర్ఓలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వీఆర్ఓలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమను మాతృశాఖలోనే కొనసాగించి అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఫయీమ్ ఖాద్రీకి వినతిపత్రం అందజేశారు.