తాండూరు: టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం పట్ల తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు హర్షం వ్యక్తం చేశారు. నెలరోజుల పాటు మునుగోడులోనే మకాం వేసి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్పై నమ్మకంతోనే మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని ఆమె పేర్కొన్నారు.