తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీమ్ అప్పు, తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అంతారం రాములు, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి రోహిత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.