పెద్దేముల్: రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మండలంలోని ఇందూరు గేట్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తట్టేపల్లి గ్రామానికి చెందిన యూసుఫ్, సోయెల్, పదవ తరగతి విద్యార్థి సమీర్ తాండూరు పట్టణం నుంచి సొంత గ్రామం తట్టేపల్లి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యూసుఫ్ తీవ్రంగా గాయపడగా సోయెల్, సమీర్ సైతం గాయపడ్డారు. క్షతగాత్రులను తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.