తాండూరు పట్టణంలోని కాళికామాత దేవాలయం, పొట్లి మహారాజ్ దేవాలయ పాలకవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ కమిటీ చైర్మన్లుగా నియామకమైన రాములు, రాజన్ గౌడ్ లతో పాటు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తమకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.