తాండూరు: శ్రీరామనవమిని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీతారాముల పవిత్రమైన బంధం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాక్షించారు.