శ్రీశైల్ రెడ్డి పంజుగుల రాసే విశ్లేషణాత్మక వ్యాసాలను తాను చదువుతున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన కథనాల్లో లోతైన అధ్యయనం, చక్కటి భావాలు కనిపిస్తాయన్నారు. గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న ఎమ్మెల్సీ ఎల్.రమణను ఆయన నివాసంలో కలిసి ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి వ్యాసాలను సీఎం కేసీఆర్ అభినందించిన విషయాన్ని ఎల్. రమణ కవితకు వివరించారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న శ్రీశైల్ రెడ్డిని అభినందించారు. ఇలాంటి విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రజలకు చాలా ఉపయోగపడతాయని, వీటిని ఇలాగే కొనసాగించాలని ఆమె సూచించారు.