తాండూరు: శ్రీ చైతన్య విద్యార్థులు తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం నాసా నిర్వహించే ఎన్ఎస్ఎస్ పోటీల్లో ఈ ఏడాది రెండవ స్థానంలో నిలిచి తాండూరు కీర్తిని పెంచారని కొనియాడారు. స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులతో పాటు డీన్ బాలరాజు, ఏఓ రవీందర్ రెడ్డి, టీం ఇంచార్జ్ శివరాంరెడ్డి తదితరులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.