యాలాల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా శివశంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో వీఆర్‌లో ఉన్న శివశంకర్‌ను యాలాలకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పని చేస్తానన్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తానని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకు ముందు ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్‌ను అధికారులు బదిలీ చేశారు.