యాలాల: యాలాల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్కెపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు సీ.రవీందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామకపత్రం అందుకున్నారు. మండలంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రవీందర్ రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.