బషీరాబాద్: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో భరోసానిస్తాయని బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్నారు. కొర్విచెడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.