తాండూరు నియోజకవర్గ ప్రజల ఆర్థిక సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రజాబంధు అగ్రికల్చర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఎలాంటి భూమిలో ఏ పంటలు వేయాలి, పంట చేతికొచ్చాక ఎక్కడ అమ్ముకోవాలి అనే విషయాలపై ఈ టీం సభ్యులు రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ రైతులకు అధునాతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఓకే రకమైన పంటలు కాకుండా భూమి నాణ్యతను బట్టి, కాలాలకు అనుగుణంగా వివిధ రకాల పంటలు పండించేలా అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యవసాయంలో వినూత్న పద్ధతులు, ఆలోచనలతో రైతులను ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల్లో నిత్యం డిమాండ్ ఉండే కూరగాయలు, పండ్లు పండించి అధిక లాభాలు పొందేలా ప్రోత్సహిస్తున్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట దిగుబడి వచ్చే వరకు ప్రజాబంధు అగ్రికల్చర్ టీం సభ్యులు నిరంతరం పంటను పర్యవేక్షిండంతో పాటు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. పంట చేతికొచ్చిన అనంతరం వారే నేరుగా మార్కెట్ కు తరలించి అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు.
ప్రజల ఆసక్తి మేరకు పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని 15 గ్రామాల్లో ఇప్పటికే చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఈ విధమైన వ్యవసాయ పద్ధతులను విస్తరించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు సాగుతున్నారు మన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
ప్రజాబంధు యాప్ వినియోగించే విధానాన్ని ఈ కింది వీడియోలో చూడండి..
ప్రజాబంధు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింద ఇచ్చిన లింక్ పై ప్రెస్ చేయండి..
https://play.google.com/store/apps/details?id=com.volteodigital.prajabandhu