ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త విధానానికి నాంది పలికారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాబంధు మొబైల్ యాప్ కు రూపకల్పన చేసి ప్రజల ముందుకు తీసుకువచ్చారు. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి పది గ్రామాలను ఒక క్లస్టర్‌గా తీసుకుని కోఆర్డినేటర్లను నియమించడంతో పాటు వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు మండల కోఆర్డినేటర్లు, నియోజకవర్గ స్థాయి కోఆర్డినేటర్లను సైతం నియమించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాబంధు మొబైల్ అప్లికేషన్ పనిచేస్తుంది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ మంజూరు, కరెంట్ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాలల నిర్వహణ.. ఇలా సమస్య ఏదైనా సరే త్వరితగతిన పరిష్కరించడంలో ప్రజాబంధు యాప్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను వారి ఇంట్లో నుంచే అతి సులభంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే అధికారులు వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చేయడమే ప్రజాబంధు మొబైల్ అప్లికేషన్ రూపొందించడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం.
ప్రజాబంధు యాప్ వినియోగించే విధానాన్ని ఈ కింది వీడియోలో చూడండి..
ప్రజాబంధు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింద ఇచ్చిన లింక్ పై ప్రెస్ చేయండి..
https://play.google.com/store/apps/details?id=com.volteodigital.prajabandhu