యాలాల: యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గిట్టుబాటు ధర చెల్లించి రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు.