తాండూరు: నావంద్గీ సొసైటీ ఆధ్వర్యంలో బషీరాబాద్‌లో నూతన పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బంకు నిర్మాణం చేపట్టేందుకు గాను రూ.25 లక్షల చెక్కును ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రతినిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. సొసైటీ లాభాలు పెరిగితే రైతులకు ఎక్కువగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.