తాండూరు: తాండూరు పట్టణం వాల్మీకినగర్ లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపానర్సిమ్ములు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల్లో నిర్వహించే జాతరలు, ఉత్సవాలు మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు.