తాండూరు: నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ పాలనలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు హోలీ రంగులు కళ్లలో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన రంగులు, నీటితోనే హోలీ నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొరారు.