తాండూరు: తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పండగ జరుపుకోలేకపోయామని, ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.