తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన 8 మందికి రూ.9 లక్షల 80 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బషీరాబాద్‌కు చెందిన తస్లీమాబేగం రూ.1.5 లక్షలు, ఎక్మాయి గ్రామానికి చెందిన శేఖర్ రూ.1 లక్ష, గోటిగాకుర్ధు గ్రామానికి చెందిన రేవంత్ రూ.1లక్ష, కంసాన్‌పల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ రూ.55వేలు, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ రూ.2.5 లక్షలు, చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన మహాదేవి రూ.1లక్ష, పెద్దేముల్ మండలం అత్కూర్ తాండాకు చెందిన శోభారాణి రూ.1లక్ష, యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చిన్నమాల రూ.1.25 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన క్యాంపు ఆఫీసులో సంప్రదించాలని ఆయన సూచించారు.