తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. తాండూరు పట్టణం మోమిన్‌గల్లికి చెందిన సుధాకర్ రూ.1 లక్ష, బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన చిన్నభీమప్ప రూ.1.25 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుత్ను పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుందన్నారు.