యాలాల: యాలాల మండలం ముద్దాయిపేట ఎల్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మేల్యే పైలట్ రోహిత్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు జాతర మొదటి రోజైన శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.