తాండూరు: మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని నేషనల్ గార్డెన్ లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ విందులకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ ముస్లింలను గౌరవిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇఫ్తార్ విందు అందిస్తున్నట్లు తెలిపారు.