తాండూరు: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. హిందూ ఉత్సవ కమిటీ వారు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.