క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలిగిస్తాయని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శాలివాహన డిగ్రీ కళాశాల మైదానం (మహాత్మ జ్యోతిబాపూలే)లో నిర్వహిస్తున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం శుభపరిణామమన్నారు.
మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ మనీ వివరాలు..
క్లస్టర్ పరిధిలో..
విన్నర్ టీంకు: రూ.10వేలు
రన్నర్ టీంకు: రూ.5వేలు
మండల స్థాయిలో..
విన్నర్ టీంకు: రూ.20వేలు
రన్నర్ టీంకు: రూ.10వేలు
నియోజకవర్గ స్థాయిలో..
విన్నర్ టీంకు: రూ.1లక్ష
రన్నర్ టీంకు: రూ.50వేలు