తాండూరు ఆర్టీసీ డిపోకు అదనపు బస్సులతో పాటు డిపోలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను కోరారు. సమయానుకూలంగా బస్సు సర్వీసులు ఉంటేనే ప్రయాణీకులకు, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. స్పందించిన బాజిరెడ్డి ప్రభుత్వం నుంచి కొత్త బస్సులు వచ్చిన వెంటనే తాండూరు డిపోకు సైతం బస్సులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు అధికారులతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న బస్సులను సమయానుకూలంగా నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.