తాండూరు: పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి సంజీవనిలా తోడ్పాటునందిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కి చెందిన సాత్విక్ కుటుంబ సభ్యులకు రూ.1.50 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన అందజేశారు. పేదలకు అండగా ఉంటూ నిరంతర సేవలను కొనసాగిస్తామని, ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.