తాండూరు: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం పంపిణీ చేశారు.
నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన 16 మంది లబ్ధిదారులు ఈ చెక్కులను అందుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు అందిస్తున్నట్లు వివరించారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు.