తాండూరు: తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నిస్వార్ధంగా సేవ చేసి నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మంత్రి కేటీఆర్ ను కలిశారు.