అమెరికాలోని న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఉత్సవాల్లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. టాటా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను తెలంగాణ వాసులు కలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చే నెల 3న ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా రాష్ట్రం నుంచి 20 మంది రాజకీయ నేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.