తాండూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆగిపోయిన రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులతో మాట్లాడి పనుల వేగవంతానికి ప్రయత్నిస్తున్నారు. మరో ఆరు నెలల్లో అన్ని రోడ్లను అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
తాండూరులోని ఇందిరాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5.30 కోట్లు మంజూరు చేయించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ పనులను ప్రారంభించనున్నారు. దీంతో పాటు కొడంగల్ నుంచి కొత్లాపూర్ వరకు ఉన్న ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 21 కోట్లను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంజూరు చేయించారు. తాండూరు పట్టణం పాత తాండూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పై వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.73 కోట్లను మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయంపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.