తాండూరు: కందెనెల్లి సమీపంలో రూ.10 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ మాట్లాడుతూ.. రూ.3 కోట్లతో అంతారం సమీపంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. తాండూరు పట్టణంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.