గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రతిభను లోకానికి చాటడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ యువ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రోహిత్ అన్న యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా అగ్గనూర్ క్లస్టర్ పరిధిలో శుక్రవారం అగ్గనూర్, ఎన్కేపల్లి గ్రామాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోటీలో విజయం సాధించిన అగ్గనూర్ టీం సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.