తెలంగాణ రాష్ట్రం మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ అద్భుత ఘట్టానికి వికారాబాద్ పట్టణం వేదికైంది. మారుమూల ప్రాంతాలకు సైతం మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టును వికారాబాద్లో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు
రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని అమలు కోసం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి ఐటీ శాఖ పనిచేస్తుంది