తాండూరు: తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పటేల్ రవిశంకర్, డైరెక్టర్లు అనంతప్ప, సాయప్ప, శ్యామమ్మ, విజయ్ కుమార్ లతో జిల్లా దేవాదాయ ఇన్ స్పెక్టర్ మధుబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పునఃనిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.