హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివిధ ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణంలో నిర్వహించిన హనుమాన్ విజయయాత్ర శోభాయమానంగా సాగింది.