పెద్దేముల్ మండలం మంబాపూర్ వరి కొనుగోలు కేంద్రంలో మంగళవారం సాయంత్రం వరకు 237 మంది రైతుల నుంచి 10,746 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ నజీర్ తెలిపారు. వరి పంట వేసిన ప్రతి రైతుకు బస్తాలు అందజేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.