తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ గ్రౌండ్ లో తాండూర్ ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
గ్రామాల్లో ఎంతో మంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని గుర్తించి ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. క్రీడాభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు.