తాండూరు: యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తాండూరు ఏడీఏ శంకర్ రైతులను కోరారు. ఈ మేరకు అన్నదాతలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడాలని, రైతు వేదికల వద్ద ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆరుతడి పంటలు వేస్తే వచ్చే లభాలను వివరించాలని ఆయన అధికారులకు సూచించారు.