తాండూరు: పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఖంజాపూర్ గేట్ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో బతకాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
త్వరలోనే అర్హులకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మరో మూడు నెలల్లోనే పేదల కల నెరవేరబోతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.