తాండూరు మండల పరిధిలోని దళిత సంఘం నాయకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కోటి రూపాయల నిధులతో తాండూరులో అంబేడ్కర్ భవనం మంజూరుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపా రు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిసి శాలువా కప్పి పూలమాలతో సత‍్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటాన్ని బహూకరించారు.