తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తామని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ సునీతారెడ్డి అన్నారు. రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ యూనిట్‌ను స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆస్పత్రిలో గత మూడేళ్లుగా సీటీ స్కాన్ సేవలు నిలిచిపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దులో ఉన్న తాండూరు ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీటీ స్కానింగ్ యంత్రాన్ని అందించడం సంతోషకరమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు.