తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పరికరాలు మరమ్మతులకు గురి కావడంతో గత మూడేళ్లుగా ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయాయి. విమానాల తయారీ సంస్థ బోయింగ్ నూతన సీటీ స్కాన్ యంత్రాలను ఆస్పత్రికి అందించడంతో మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆస్పత్రి అధికారులు కోరారు.