తాండూరు: పట్టణంలోని 13వ వార్డు పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చేదిశగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.