ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాను కృషి చేస్తుంటే కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. వారు ఎంతటి వారైనా సరే సహించేది లేదని తన ప్రత్యర్థులను ఉద్దేశించి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమంలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.