తాండూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి పిలుపునిచ్చారు. యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆదివారం తాండూరు పట్టణంలో విడుదల చేశారు. జిల్లాలో బండి సంజయ్ యాత్ర సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.