తాండూరు: శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకొని పెద్దేముల్ మండలం తట్టిపల్లి శివారులో ఉన్న అంబురామేశ్వర ఆలయం జాతరలో కొబ్బరికాయలు అమ్ముకునేందుకు, పార్కింగ్ కోసం వేలం వేయనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఈనెల 30న ఉదయం 10 గంటల లోపు ఆలయానికి రావాలన్నారు.
వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.1000లు అడ్వాన్స్‌గా చెల్లించాలన్నారు. టెండర్ దక్కించుకున్న వారు వెంటనే 50 శాతం డబ్బులు చెల్లించాలని.. మిగతా 50 శాతం జాతర పూర్తయిన తరువాత చెల్లించవచ్చని తెలిపారు.