తాండూరు మడలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకునేందుకు గురువారం చివరి రోజు అని ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు. ఓగిపూర్, సంకిరెడ్డిపల్లి తండాలో టీచర్ పోస్టులు, మల్కాపూర్, కోత్లాపూర్, గుండ్లమడుగు తండా, మైసమ్మతండా, నారాయణపూర్ గ్రామాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.