తాండూరు: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనా కట్టడికి సహకరించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు. శనివారం తాండూరు పట్టణం 4వ వార్డులో ఐసీఎంఆర్ అధికారులు నిర్వహించిన కోవిడ్ సర్వేలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సర్వేలో భాగంగా 40 మంది నుంచి అధికారులు రక్త నమూనాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల్లో వ్యాధి నిరోధకతను అంచనా వేసేందుకు రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నివారణపై అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.