తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారమే థ్యేయంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 18 వార్డుల్లో ఆయన గతవారం పర్యటించారు. మరో 18 వార్డుల్లో పర్యటనకు గాను ఈ కార్యక్రమాన్ని నేడు తిరిగి ప్రారంభించారు. ఎమ్మెల్యే పర్యటనకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యే పర్యటన కొనసాగనుంది.
ప్రజలు ఆయన దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సైడ్ కాల్వలు, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో తాండూరును సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.